సింగర్‌పై కురిసిన నోట్ల వర్షం.. బస్తాల కొద్దీ డబ్బులు కుమ్మరించిన వీడియో వైరల్‌

  • జునాగఢ్‌ భజన కార్యక్రమంలో ఘటన
  • డబ్బుల కుప్పలో మునిగిన గాయకుడు
  • వీడియోపై నెటిజన్ల భిన్నమైన స్పందన
గుజరాత్‌కు చెందిన ఓ జానపద గాయకుడు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. జునాగఢ్‌లోని ఖంభాలియా గ్రామంలో జరిగిన సంప్రదాయ ‘డైరో’ కార్యక్రమంలో ప్రముఖ భజన గాయకుడు గోపాల్‌ సాధు పాట పాడుతుండగా భక్తులు ఆయనపై నోట్ల వర్షం కురిపించారు.

ప్రస్తుతం వైరలవుతున్న ఈ వీడియోలో గాయకుడు గోపాల్‌ సాధు హార్మోనియం వాయిస్తూ పాట పాడుతున్నారు. ఆ టైమ్‌లో భక్తులు పెద్ద ఎత్తున సంచులతో నోట్ల తీసుకొచ్చి ఆయనపై కుమ్మరించారు. ఒకానొక దశలో డబ్బుల కుప్ప చాలా ఎత్తుకు పెరిగిపోవడంతో గాయకుడు అసలు కనిపించకుండా పోయారు. అయినా సరే ఆయన ఏమాత్రం తొణకకుండా తన ప్రదర్శనను కొనసాగించారు.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘నిజమైన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అంటే ఇది. కూర్చున్న చోట నోట్ల వర్షం కురుస్తోంది’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘ఆ డబ్బుల కుప్పలో ఆయనకు ఊపిరి ఆడుతుందో లేదో’ అంటూ మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. ఈ డబ్బును పేదల సంక్షేమానికి వాడితే బాగుంటుందని మరొకరు సలహా ఇచ్చారు.

గుజరాత్‌లో ఇలాంటి సంప్రదాయ సంగీత కార్యక్రమాల్లో గాయకులపై డబ్బులు చల్లడం కొత్తేమీ కాదు. గతంలో 2022, 2023 సంవత్సరాల్లో కూడా ప్రముఖ గాయకుడు కీర్తీదాన్‌ గధ్వి కార్యక్రమాల్లో ఇలాగే రూ.లక్షలు విలువ చేసే నోట్లను వర్షంలా కురిపించారు. ఇలా సేకరించిన సొమ్మును గోసంరక్షణ లేదా ఇతర సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారని సమాచారం.  

Gopal Sadhu
Gujarati singer
folk singer
bhajan singer
Gujarat
Khambhaliya
Dairo program
currency notes
social service
Kirtidan Gadhvi

More Telugu News